తమిళనాడు సీఎంగా పళని స్వామికి అవకాశం

పళని స్వామి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. పళని స్వామిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆహ్వానించారు.  అంతకు ముందు పళని స్వామి గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు. అయనతో పాటుగా పార్టీ సీనియర్ నేతలు గవర్నర్ ను కలిశారు. దాదాపు 15 నిమిషాలు పాటు గవర్నర్ తో పళినస్వామి బృందం భేటీ అయింది. తనకు పూర్టి మెజార్టీ ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం కల్పిచాలని పళని స్వామి మరోసారి గవర్నర్ ను కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తే వెంటనే బల నిరూపణకు సిద్ధమని పళని స్వామి గవర్నర్ తో చెప్పినట్టు తెలుస్తోంది.