మాదాపూర్ లో కాల్ సెంటర్ ఉద్యోగిని హత్య

హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. మృతురానికి సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన సునితగా పోలీసులు గుర్తించారు. సునీత అమీర్ పేట్ లో టెలికాలర్ గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాలిపోయిన స్థితిలో ఉన్న ఈ యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మాధాపూర్ లోని భాగ్యనగర్ కో-ఆపరేటివ్ సొసైటీ సమీపంలోని ఎన్ఐఏ భవనం పక్కన ఈ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అక్కడ లభించిన ఆధారాల ద్వారా మృతురాలిని గుర్తించారు. బుధవారం ఇంటి నుండి ఆఫీస్ కు బయలుదేరిన సునీత సాయంత్రం ఆఫీస్ నుండి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లోగా సునీత దారుణ హత్యకు గురైన సమాచారం వారి కుటుంబ సభ్యులకు అందింది.
అమీర్ పేట కాల్ సెంటర్ లో పనిచేస్తున్న సునీత మాధాపూర్ కు ఎందుకు వచ్చారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ఇక్కడ హత్యచేశారా లేక ఇంకెక్కడైనా హత్య చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి పడేశారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హతురాలికి తెలిసిన వారే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *