లీకయిన అమిజాక్సన్ వ్యక్తిగత ఫొటోలు

amy-jackson-biography

     ప్రముఖ నటి అమీ జాక్సన్ వ్యక్తిగత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో లీక్ కావడం కలకలం సృష్టిస్తోంది. ఈ నటి తన ఫోన్ లో పెట్టుకున్న చిత్రాలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో ఆమె ఖంగుతిన్నారు. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు అమి జాక్సన్ వెల్లడించింది. ముంబై నుండి చెన్నై వెళ్లాల్సిన అమీ జాక్సన్ ఫోన్ ను తీసుకుని మెబైల్ దుకాణానికి వెళ్లింది. అక్కడే ఆమో ఫోన్ హ్యాక్ అయినట్టు భావిస్తున్నారు. ఫోన్ హ్యాక్ కావడంతో పాటుగా ఆమె వ్యక్తిగత చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించడంతో అప్రమత్తమైన అమీ జాక్సన్ పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించారు. వ్యక్తిగత ఫొటోలతో పాటుగా ఫోన్ లో ఉన్న సమాచారం కూడా లీక్ అయినట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం 2.0 సినిమా షూటింగ్ లో బిజిబిజిగా ఉన్న అమీ జాక్సన్ ఈ విషయంపై స్పందించారు. తన వ్యక్తిగత ఫోటోలు బయటకు రావడం ఫోన్ హ్యాక్ కావడం చిన్న విషయం కాదని ఆమె అంటోంది. ఈ విషయాన్ని తలిగ్గా తీసుకునేది లేదని దీనిపై పోలీసులకు, సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తన ఫోన్ హ్యాకయిందని తెలియగానే తాను షాక్ కు గురైనట్టు  అమిజాక్సన్ చెప్పారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న తన ఫొటోలపై ఏం చేయాలనేది పోలీసులతో మాట్లాడిన తరువాత నిర్ణయిస్తానని చెప్పారు. తన ఫోన్ ను ఎవరు హ్యాక్ చేశారో తెలియదని అమి జాక్సన్  చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *