పుచ్చకాయ్…తినరా భాయ్…

ఎండాకాలం మొదట్లోనే పుచ్చకాయలు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. ఈ సీజన్ లో విరివిగా లభించే పుచ్చకాయలను తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎన్నో. వంటికి చలువ చేసే పుచ్చకాయలు శరీరానికి నూతన శక్తినిస్తాయి.   పుచ్చకాయల్లో   సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు ఉంటాయి.   హృదయ సంబంధ వ్యాధులకి, ప్రేగు కేన్సర్‌కి, అలాగే మధుమేహానికి పుచ్చకాయలు మేలు చేస్తాయి. రక్త పోటు ఉన్నవారు పుచ్చకాయ తింటే ఎంతో మేలు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలే ఇందుకు కారణం. మామూలుగా పుచ్చకాయలో 92 శాతం నీళ్లే ఉంటాయి. అందులోని 8శాతం లైకోపీన్ మాత్రం వీర్యవృద్ధిని పెంచటమేగాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో సులక్షణాలను కలిగి ఉంది. లైకోపీన్ అనబడే ఈ ఫైటో కెమికల్ గుండె, ప్రొస్టేట్, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. అలాగే ఓవరియన్, సర్వికల్, నోటి సంబంధిత క్యాన్సర్లనుంచి కూడా రక్షణనిస్తుంది. ఇంకా పుచ్చకాయ వేసవినుంచి చర్మాన్ని కాపాడుతుంది. కాలిన గాయాలమీద చల్లని పుచ్చకాయ ముక్కల్ని ఉంచితే ఉపశమనం కలుగుతుంది.
100 గ్రా. పుచ్చకాయ గుజ్జులో
నీరు – 95.2 గ్రా., ప్రోటీన్ – 0.3 గ్రా., కొవ్వు పదార్థాలు – 0.2 గ్రా., పీచు పదార్థాలు – 0.4 గ్రా., కెరోటిన్ – 169 మైక్రో గ్రా., సి విటమిన్ – 26 మి.గ్రా., కాల్షియం – 32 మి.గ్రా., ఫాస్ఫరస్ – 14 మి.గ్రా., ఇనుము – 1.4 మి.గ్రా., సోడియం – 104.6 మి.గ్రా. ,పొటాషియం – 341 మి.గ్రా. , శక్తి – 17 కిలోకాలరీలు వున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *