చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా సినీ హీరోయిన సమంతను ఎందుకు పెట్టారు అన్నదానిపై మంత్రి కేటీఆర్ వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ డిమాండ్ చేశారు. చేనేత వస్త్రాల ప్రచారానికి తెలంగాణకు చెందిన వారు ఎవరూ పనికి రాలేదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నడూ చేనేత కట్టని సమంతను తీసుకుని వచ్చి చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం విడ్డూరంగా ఉందని షబ్బీర్ ఆలీ అన్నారు. నాగార్జునతో కేటీఆర్ కు లావాదేవీలు ఉన్నాయని వీటి కోసమే సమంతను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. రారజకీయాల్లో కేటీఆర్ బచ్చా గా షబ్బీర్ అభివర్ణించారు. నీలాంటి వాళ్లను కాంగ్రెస్ పార్టీ ఎంతోమందిని చూసిందన్నారు. రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని కేటీఆర్ తాను పెద్ద నాయకుడు అయిపోయినట్టు భావిస్తున్నారని షబ్బీర్ విరుచుకుని పడ్డారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ది చెప్తారని అన్నారు. టీఆర్ఎస్ నాయకులను ప్రజలు చెప్పులతో కొట్టేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని షబ్బీర్ జోస్యం చెప్పారు. తెలంగాణలో వెంటనే హల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యం పూర్తిగా పడకేసిందని అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.