శశికళ స్థానంలో పళనిస్వామి

అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా పళని స్వామి ఎంపికయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడిన నేపధ్యంలో గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఉన్న అన్నాడీఎంకే శశికళ వర్గం ఎమ్మెల్యేలు పళని స్వామి తమ శాసనసభా పక్షనేతగా ఎన్నుకున్నారు. పళని స్వామి నేతృత్వంలో బృందం గవర్నర్ ను కలిసి తమ పార్టీ నిర్ణయాన్ని వివరించే అవకాశం ఉంది. పళిని స్వామిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని వీరు కోరుతున్నారు. జైలు శిక్ష ఖరారు కావడంతో శశికళకు ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలు స్వీకరించే దారులు మూసుకుని పోవడంతో పళని స్వామిని ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోబెట్టే ప్రయత్నాలను శశికళ ముమ్మరం చేశారు. పళని స్వామి ఎడప్పాటి నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖతో పాటుగా నౌకాశ్రయ శాఖలను నిర్వహిస్తున్నారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ పన్నీరు సెల్వానికి అధికారం దక్కకుండా పావులు కదుపుతున్నారు. మరో వైపు పన్నీరు సెల్వాన్ని అన్నా డీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి కూడా తొలగిస్తూ శశికళ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందకు గాను పన్నీరు సెల్వాన్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగిస్తున్నట్టు శశికళ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *