స్వామి ఆశీస్సులతో కౌంట్ డౌన్ ప్రారంభం

0
49

 
రికార్డు స్థాయిలో 101 ఉపగ్రహాలను నింగిలోకి పంపెందుకు సిద్ధమైన ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇప్పటికే ప్రయోగపు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా బుధవారం 9.29 గంటలకు 101 ఉపగ్రహాలను నింగిలోకి పంపడానికి ఇస్రో సిద్దమైన నేపధ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం శాస్త్రవేత్తలు తిరుమల చేరుకున్నారు. వాహక నౌక నమూనాలకు స్వామివారి పాదాల చెంత ఉంచిన శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతీ ప్రయోగానికి ముందు స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం ఇస్రో శాస్త్రవేత్తలు ఆనవాయితీగా వస్తోంది. భారత్ కు చెందిన ఉపగ్రహాలతో పాటుగా వివిధ దేశాలకు చెందిన మొత్తం 101 ఉపగ్రహాలను ఇస్రో ఓకే సారి నింగిలోకి పంపనుంది. ప్రపంచంలో మరే దేశమూ ఇన్ని ఉపగ్రహాలను నింగిలోకి ఇప్పటివరకు పంపేదు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here