సైనికులపై పిచ్చి రాతలు-మండిపడ్డ సెహ్వాగ్

 
మాజీ క్రికెటర్ వీరేంద్ర సేహ్వాగ్ కాశ్మీర్ కు చెందిన కొంత మంది యువకులపై తీవ్రంగా మండిపడ్డాడు. వారి వ్యవహార శైలి దారుణంగా ఉందని వారిని వర్ణించడానికి మాటలు చాలవంటూ మండిపడ్డ సేహ్వాగ్ వారి మానసిక స్థితి సరిగా లేనివారిగా కనిపిస్తున్నారని వారు త్వరగా కోలుకోవాలంటూ ట్విట్ చేశారు. ట్వట్టర్ లో నిత్యం వివిధ అంశాలపై తన స్పందన తెలియజేసే సేహ్వాగ్ కాశ్మీర్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ పై స్పందించాడు. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు భారత జవాన్లు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేసిన సేహ్వాగ్ వీర మరణం పొందిన జవాన్లు రఘుబీర్ సింగ్, బందోరియా గోపాల్ సింగ్ ల ఆత్మకు శాంతి కలగాలంటూ ట్విట్ చేశారు.  దీనిపై స్పందించిన కొందరు కాశ్మీరీ యువకులు సెహ్వాగ్ ను గేలిచేశారు. అంతటితితో ఆగకుండా భారత వ్యతిరేక వ్యఖ్యలు చేశారు. మహ్మద్ ఉమెర్ అనే వ్యక్తి సేహ్వాగ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాడు. భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. వాస్తవాధీన రేఖను తొలగించాలంటూ తాను బిగ్గరగా అరుస్తాను అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా జవాన్ల వీరమరణం పై కూడా దారుణంగా వ్యాఖ్యానించాడు. దీనికి సెహ్వాగ్ ధీటుగా స్పందించారు. వారి మానసిక స్థితి సరిగా లేదంటూ వారిని వర్ణించడానికి డిష్నరీలో పదాలు లేవంటూ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *