అమెరికాలోని కాలిఫోర్నియాలో నల్లజాతీయుల చేతిలో హత్యకు గురైన వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి వంశీరెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. కారు ఢీ కొట్టాడనే చిన్న కారణంలో వంశీ రెడ్డిపై కాల్పులు జరిపి హత్యచేసిన వారికి కఠిన శిక్షపడేలాగా ప్రభుత్వం సహకరిస్తుందని భారత్ భరోసా ఇచ్చింది. ఈ మేరకు విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వంశీ రెడ్డి తండ్రి తో స్వయంగా ఫోన్ లో మాట్లాడారు. వంశీ రెడ్డి మృతదేహాన్ని భారత్ కు రప్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని సుష్మా హామీ ఇచ్చారు. మరోవైపు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తన కుమారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడన్న వాస్తవాన్ని వంశీ రెడ్డి తల్లి దండ్రులు జీర్ణించులేకపోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. చురుల్లా చాలాకీగా అందరితోనూ కలుపుగోలుగా ఉండే వంశీ రెడ్డి మరణించడంతో ఆయన స్వస్థలంలో విషాధచాయలు అలముకున్నాయి. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వ్యక్తి అక్కడి నల్ల జాతీయుల చేతిలో మరణించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.