నాకు నటన రాదంటున్న పవన్ కళ్యాణ్

 
తనకు నటనంటే నచ్చదని సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నాడు. అమెరికా పర్యటనలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.   హార్వర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థుల సదస్సు కోసం వచ్చిన ఆయన  నషువాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తాను నటుడ్ని కావాలని ఎప్పుడూ కోరుకోలేదని పవన్ చెప్పడు. తనకు నటన అంటే పెద్దగా ఇష్టం లేదని కానీ అనుకోకుండా నటుడిని అయ్యాయని పవన్ కళ్యాణ్ వివరించారు. తనకు డైలాగులు చెప్పడం ఇష్టం లేదని, హీరోయిన్లతో డ్యాన్సులు చేయడం ఇబ్బందిగా ఉంటుందని అన్నారు.  నచ్చినా నచ్చకపోయినా ఒకసారి నటలో దిగిన తరువాత తాను అవన్నీ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు.
రాజకీయాల్లోకి రావడం తనకు కొత్తగా ఏమీలేదని పవన్ పేర్కొన్నారు. తానకు రాజకీయాలంటే ఇష్టమని అన్నారు. తాను సినిమాల కంటే రాజకీయాలంటేనే ఎక్కువ ఇష్టపడతానని పవన్ చెప్పారు. ప్రజలకు సేవచేయాలనే కోరికతో రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *