పీ.వీ.నరసింహా రావు లాంటి నేతల పట్ల కాంగ్రెస్ పార్టీ అమానషంగా వ్యవహరించిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ లోని కేశవ మెమోరియల్ లో పండిట్ దీన్ దయాళ్ సమర్పణ దివస్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య మాట్లాడుతూ నెహ్రు కుటుంబానికి చెందిన వ్యక్తులకు మినహా కాంగ్రెస్ పార్టీలో ఇతరులకు కనీస గౌరవ మర్యాదలు లేవని వెంకయ్య దుయ్యబట్టారు. పి.వి.నరసింహా రావును కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవమానించిందో అందరికీ తెలుసన్నారు. సామాన్య స్థాయి నుండి ఎదిగిన వ్యక్తులపై కాంగ్రెస్ పార్టీకి చిన్న చూపని అన్నారు. వారిని పట్టించుకునే ఆచారం కాంగ్రెస్ పార్టీలో లేదని అన్నారు. నెహ్రు కుటుంబానికి భజన చేయడం తప్పిస్తే కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులకు ప్రధాన్యత లేదని అన్నారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన మోడీ ప్రధాని కావడం కాంగ్రెస్ పార్టీకి జీర్ణం కావడం లేదని అన్నారు.
దేశ చరిత్రను మలుపు తిప్పిన గొప్ప వ్యక్తల్లో దీన్ దయాళ్ ఒకరని మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గొప్ప నేతల అడుగుజాడలు ఎప్పటికీ మరువకూడదని అన్నారు. ప్రధాని మోడీ హయంగా భారత దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుని పోతోందన్నారు. బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.