యూపీలో 63శాతం ఓటింగ్

0
53

ఉత్తర్ ప్రదేశ్ లో తొలిదశ పోలింగ్ ముగిసింది. మొత్తం 63 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూపీలోని 15 జిల్లాల్లోని 73 నియోజకవర్గాల్లో  పోలింగ్ ముగిసింది. ఈసారి ఉత్తర్ ప్రదేశ్ లో త్రిముఖ పోరు సాగుతోంది. అధికారంలో ఉన్న సమజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా ఈ దఫా ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ, బీఎస్పీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇటు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించగా ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లు ఉత్తర్ ప్రదేశ్ లో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బీఎస్పీ ప్రచారాన్ని మొత్తం బుజాన వేసుకున్న మాయావతి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 15,19,23,27వ తేదీలతో పాటుగా మార్చి 4,ఎనిమిదవ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని ధపాలు పూర్తయిన తరువాత మార్చి 11వ తేదీన ఎన్నికల ఫలితాలు విలువడనున్నాయి.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here