అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో మాట్లాడిన ఏపీ సీఎం కోడలు నారా బ్రాహ్మణి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మహిళా సాధికారికత అనే అంశంపై రెండోరోజు జరుగుతున్న సదస్సులో బ్రాహ్మణి మాట్లాడారు. అమె ప్రసంగించిన తీరు సభికులను ఆకట్టుకుంది. స్వచ్చమైన భాషలో ఎక్కడా తడబడకుండా బ్రాహ్మణి చేసిన ప్రసంగానికి మంచి మార్కులే పడ్డాయి. మహిళలు విద్యారంగంలో రాణించినప్పుడే ఇతర రంగాల్లోనూ రాణిస్తారని ముఖ్యంగా విద్యపై మహిళలు దృష్టిపెట్టాలని ఆమె అన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే వారు పురుషులకు ఏమాత్రం తీసిపోరని అన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు దూసుకుని పోతున్నా ఇంకా మహిళల పట్ల వివక్ష కొనసాగడం దారుణం అన్నారు.
మహిళల పట్ల చులకన భావం విడనాడాలను బ్రాహ్మణి అన్నారు. ఎంతో మంది మంది మహిళలు అవకాశాలు లేకపోవడం అనే ఒకే ఒక కారణం వల్ల వెనుకబడిపోతున్నారని బ్రాహ్మణి చెప్పారు. సమాన అవకాశాలు లభిస్తే మహిళలు పురుషులను మించిపోతారని తనకు నమ్మకం ఉందన్నారు. విద్యారంగంలో మహిళలు మరింత రాణించాల్సి ఉందని, మహిళలను పురుషులతో సమానంగా చదివించాలని అన్నారు. అమ్మాయిలను చదువులకు దూరం చేసే సంస్కృతి పోవాలని బ్రాహ్మణి అన్నారు. తాను కీలక పాత్ర పోషిస్తున్న హెరిటేజ్ సంస్థలో మహిళలకు పెద్ద పీటవేస్తున్నట్టు బ్రాహ్మణి చెప్పారు. పురులుషులతో సమానంలో మహిళలు పనిచేయగలరని, అవకాశం ఉంటే వారిని అధికమించే సహనం, ఓర్పు మహిళల సొంతం అనే విషయాన్ని తాను స్వయంగా పరిశీలించినట్టు బ్రాహ్మణి చెప్పారు. తమ సంస్థ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశలు కల్పిస్తున్నందుకు తనకు ఆనందంగా ఉందని చెప్పారు. హెరిటేజ్ సంస్థ ద్వారా పెద్ద సంఖ్యలో మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారని చెప్పారు.