రక్షణ రంగంలో అరుదైన ఘనత

భారత రక్షణ శాస్త్రవేత్తలు మరో అరుదైనా ఘనతను సాధించారు. ఇప్పటివరకి కేవలం అమెరికా,రష్యా,ఇజ్రాయిల్ కు మాత్రమే సాధ్యమైన క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ విజయవంతంగా అభివృద్ది పర్చుకుంది. ఈ వ్యవస్థ ద్వారా ఖండాంతర క్షిపణులు భారత్ పై దాడులు జరకుండా రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా శతృదేశాలకు చెందిన క్షిపణులను దారిలోనే అడ్డుకోవడం, వాటిని ద్వంసం చేయడానికి వీలు కలుగుతుంది. భారత్ పొరుగున ఉన్న చైనా, పాకిస్థాన్ సహా ప్రపంచంలోని చాలా అగ్రరాజ్యాల వద్ద ఈ వ్యవస్థ లేదు. ఇప్పటివరక కేవలం అమెరికా,రష్యాలతో పాటుగా ఇజ్రాయిల్ కు మాత్రామే పరిమితం అయిన ఈ అధునాతన వ్యవస్థ ఇప్పుడు భారత్ కు కూడా అందుబాటులోకి వచ్చింది.
క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ వ్యవస్థ భారత్ కు చెందిన పృద్వీ క్షిపణిని విజయవంతంగా అడ్డుకోగలిగింది. అత్యాధునిక క్షిపణి అయిన పృద్వీని అడ్డుకున్న ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోని అన్ని రకాల క్షిపణులను విజయవంతంగా అడ్డుకునే సత్తా ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అతి త్వరలోనే ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సైన్యానికి అందుబాటులోకి రానుంది. ఇటీవల చైనా ఖంతార క్షిపణులను విజయవంతంగా ప్రయోగించడంతో పాటుగా ఆ సాంకేకిత పరిజ్ఞానాన్ని పాకిస్థాన్ కు అందచేస్తున్న నేపధ్యంలో భారత్ నిర్వహించిన ఈ పరీక్ష ప్రధాన్యం సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *