శశికళ కు మరో ఎదురుదెబ్బ

వరుస ఎదురు దెబ్బలతో చిన్నమ్మ శశికళ సతమతమవుతోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేద్దామని ఉవ్వీళూరుతున్న శశికళకు ఇంచార్జీ గవర్నర్ చుక్కలు చూపిస్తున్నారు. ఒక వైపు కేంద్రం వ్యూహాత్మకంగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఆలస్యం చేస్తున్న క్రమంలో మరో వైపు పన్నీరు సెల్వంకు అటు ప్రజలతో పాటుగా ఇటు పార్టీ వర్గాల్లోనూ మద్దతు పెరుగుతోంది. పులిమీద పుట్రలాగా కోర్టు కేసులు కూడా శశికళకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కోర్టు తీర్పు శశికళ రాజకీయ భవితవ్యాన్ని తేల్చనుండగా మరో వైపు పలు కేసులు ఆమెను చుట్టుముట్టాయి. శశికళ అన్నా డీఎంకే కార్యదర్శిగా ఎన్నికకావడం చట్టవ్యతిరేకమ అంటూ ఒక కేసు దాఖలు కాగా మరో వైపు ఎమ్మెల్యేలను నిర్బంధించారని మరో కేసు విచారణకు వచ్చింది.
శశికళ ఎమ్మెల్యేలను బలవంతంగా నిర్బంధించారని అంటూ కోర్టులో కేసు నమోదు కావడం కోర్టు దాన్ని విచారణకు స్వీకరించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్న గోల్డెన్ బీచ్ రీసార్డ్ట్స్ కు పోలీసులు, రెవెన్యూ యంత్రాగం చేరుకుంది. ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు పోలీసులు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల పైకి శశికళ అనుచరులు దాడులకు దిగారు. ఎమ్మెల్యేలతో పోలీసులు మాట్లాడాల్సిన అవసరం లేదని వారిస్తూ పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీనితో అక్కడ తీవ్ర ఉధ్రిక్తత వాతావరణ నెలకొంది. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలలో మెజారిటీ వర్గం శశికళకు మద్దతు ఇస్తున్నప్పటికీ రోజులు గడిచేకొద్ది పరిస్థితి మారవచ్చని శశికళ వర్గం కంగారు పడుతోంది. ఎక్కడ ఎమ్మెల్యేలే చేజారి పోతారేమోనని వారందరిని క్యాంప్ లకు తరలించిన నేపధ్యంలో శశికళ ఎమ్మెల్యేలను నిర్బంధించారంటూ కేసు దాఖలైంది. ప్రస్తుతం పోలీసులు క్యాంపు వద్దకు చేరుకోవడంతో శశికళ వర్గానికి పెద్ద ఎదురుదెబ్బనేనని చెప్తున్నారు. ఎమ్మెల్యేల వలస మొదలైతే దాన్ని ఆపడం కష్టం అని భావిస్తున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు క్యాంకు నుండి బయటకు చేరుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు మద్దతు ప్రకటించిన నేపధ్యంలో క్యాంపు వద్ద శశికళ వర్గీయులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *