అఖిలేష్ అభివృద్ది ఇందులోనే:మోడీ

 
సమాజ్ వాదీ పార్టీ పాలనలో ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధి చెందిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే సమాజ్ వాదీ పార్టీ చేసిన అబివృద్ధి రోడ్లు వేయడం, ప్రజలకు తాగు నీరు అందిచడం, రైతులను ఆదుకోవంలో కాదని రాష్ట్రంలో నేరాల సంఖ్యలో విపరీతంగా అబివృద్ధి చెందిందని మోడీ చమత్కరించారు. ఉత్తప్రదేశ్ అలీఘడ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ రాష్ట్రంలో రోజురోజుకూ నేరాల సంఖ్య పెరిగిపోతోందని వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని దుయ్యబట్టారు.  ఒక్క రోజులో 7650 నేరాలు, 24 అత్యాచారాలు, 21 అత్యాచార యత్నాలు, 33 కిడ్నాప్‌లు, 19 ఘర్షణలు, 136 దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయన్నాని లెక్కలతో సహా ప్రధాని వివరించారు. దేశంలో ఇంకా కరెంటు సైకర్యం లేని గ్రామాలు ఉన్నాయంటే సిగ్గుతో తలవంచుకోవాలని అన్నారు. కరెంటు లేని గ్రామాలు ఉత్తర్ ప్రదేస్ లోనే ఎక్కువగా ఉన్నాయని మోడీ వివరించారు. కరెంటు సదుపాయం లేని గ్రామాలు భారత దేశంలో ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ద్వారా అందచేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించడం లేదని మోడీ ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నిజమైన అబివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు మార్పుకోసం ఎదురు చూస్తున్నారని అధికార పార్టీని తరిమికొట్టడం ఖాయం అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంతమంచిదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *