మోడీ అబద్దాల కోరు:రాహుల్

ప్రధాని నరేంద్ర మోడీని పెద్ద అబద్దాల కోరుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ లో  ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుని పడ్డారు. మోడీకి నిజం చెప్పే అలవాటు లేదని దుయ్యబట్టారు. తాను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని భావిస్తున్న మోడీ ప్రజలను నిలువునా వంచిస్తున్నారని అన్నారు. ప్రధాని చెప్పే మాటలను ప్రజలు నమ్మె స్థితిలో లేరని రాహుల్ చెప్పారు. అబద్దాలను నిజాలుగా భ్రమించచేయడంలో మోడిని మించిన వారు లేరని రాహుల్ అన్నారు. బీహార్ ఎన్నికలు ముందు బీహార్ గురించి మాట్లాడిన ప్రధాని మోడి అక్కడి ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత బీహర్ ను గురించి మాట్లాడమే మానేశారని యూపీ ఎన్నికల తరువాత కూడా మోడీ యూపీ గురించి మాట్లాడరని అన్నారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలను SCAM గా అభివర్ణించిన మోడీ మాటలను రాహుల్ తిప్పికొట్టారు.  (SCAM) అంటే సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్, అఖిలేష్, మాయావతి అని మోడి అనుకున్నారని అయితే స్కాం అంటే సర్వీస్‌, కరేజ్‌, ఎబిలిటి,  మాడెస్ట్  రాహుల్‌ అభివర్ణించారు.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ కూటమిని గెలిపించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే కన్పూర్ కు మెట్రోరైలు సౌకర్య కల్పిస్తామని చెప్పారు. ప్రజలు తాగునీటి కోసం పడుతున్న కష్టాలు తీరుస్తామని చెప్పారు. తమ పాలనలో జరిగిన అభివృద్దిని చూసి ఓటు వేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *