తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా దివంగత్ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ఎంపికయ్యారు. చెన్నైలో సమావేశం అయిన అన్నాడీఎంకే శాసనసభా పక్షం శశికళను తమ అధ్యక్షురాలిగా ఎన్నుకుంది. దీనితో పన్నీరు సెల్వం స్థానంలో శశికళ ముఖ్యమంత్రి పిఠాన్ని అధిష్టించనున్నారు. శశికళ నివాసం పోయస్ గార్డెన్స్ లో సమావేశం అయిన అన్నాడీఎంకే శాసనసభా పక్షం శశికళ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం శశికళ పేరును ప్రతిపాదించగా ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఆ తీర్మానానికి ఆమోదం తెలిపారు.