చంద్రబాబును రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటు కు నోటు కేసులో తాను అప్రూవర్ గా మారాతనంటూ చంద్రబాబును రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందేనని అన్నారు. బోగస్ ప్రచారంతో పబ్బంగడుపుకునే నేత రేవంత్ అని అన్నారు. రేవంత్ ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసునని అందితే జుట్టు అందకుంటే కాళ్లు అనే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తారని ఎర్రబెల్లి తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ వి అన్నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలని అన్నారు. రాత్రిళ్లు రేవంత్ ఎక్కడికి పోతారో అందరికీ తెలుసంటూ తీవ్రంగా మండిపడ్డారు. తాను తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానంటూ వచ్చిన వార్తలను ఎర్రబెల్లి ఖండించారు. తనను రాజకీయంగా దెబ్బతీయడం  కోసం కొంత మంది పనిగట్టుకుని ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను ఏక్కడికీ వెళ్లడం లేదని టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణను కలిసిన మాట వాస్తవమేనని ఎర్రబెల్లి చెప్పారు. రమణ చాలాకాలంగా తనకు మిత్రుడని తాను రమణను కలవడం కేవలం వ్యక్తిగత అంశమని ఇందులో రాజకీయాలకు ఎటువంటి తావు లేదని స్పష్టం చేశారు. రాజకీయాలు వేరు వ్యక్తిగత స్నేహం వేరు అని ఎర్రబెల్లి అన్నారు. ఇతర పార్టీల్లోని స్నేహితులను కలిస్తే తప్పెంటని ఎర్రబెల్లి ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *