పంజాబ్, గోవాల్లో పూర్తయిన పోలింగ్

పంజాబ్, గోవాల రాష్ట్రాల శాసనసభ  ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పంజాబ్ లోని 117 స్థానాలకు, గోవాలోని 40 స్థానాలకు ఈ ఉదయం మొదలైన పోలింగ్ సాయంత్రానికి ముగిసింది.  పంజాబ్ లో 66 శాతం పోలింగ్ నమోదు కాగా చిన్న రాష్ట్రం గోవాలో 88 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే దఫా ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఫలితాల కోసం మాత్రం అభ్యర్థులు మార్చి 11వ తేదీ వరకు ఆగాల్సిందే. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో అక్కడ పోలీంగ్ పూర్తియిన తరువాత ఓకేసారి ఐదు రాష్ట్రాలకు సంబంధించి మార్చి 11న ఫలితాలను వెళ్లడించనున్నారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయి.
ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డగా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేసింది. పంజాబ్ లో అకాలీదళ్ తో కలిసి బీజేపీ కూటమి పోటీ చేయగా కాంగ్రెస్ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగింది. ఇరు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రెండు పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆప్ భారీగా ఓట్లను చీల్చడం ఖాయం గా కనిపిస్తోంది. పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదని విశ్లేషకులు అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత జరుగుతున్న మొదటి ఎన్నికల అయినందుకు అన్ని పార్టీలు సర్వ శక్తులను ఒడ్డి  ప్రచారం నిర్వహించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *