అమెరికా-ఇరాన్ ల మద్య తీవ్ర ఉధ్రిక్తత

గల్ఫ్ లో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నట్టే కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ ల మద్య ఉధ్రిక్తతలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇరాన్ తో సహా మరో ఆరు దేశాలకు చెందిన వారు అమెరికాలో ప్రవెశించకుండా ట్రంప్ ఆంక్షలు విధించిన నేపధ్యంలో ఇరాన్ అమెరికా పై విమర్శల జోరను తీవ్రంగా పెంచింది. ఆమెరికా చర్యలను ఇరాన్ తీవ్ర స్వరంతో నిరసిస్తోంది. మరో వైపు అటు అమెరికా కూడా ఇరాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుని పడుతోంది.  ప్రపంచంలోనే అత్యధికంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం ఇరాన్‌లోనే ఉందని  పెంటగాన్‌ చీఫ్‌ జేమ్స్‌ మ్యాటిస్‌ అన్నారు. దీనిపై అంతే ధీటుగా ఇరాన్ స్పందించింది. అమెరికా కు తాను భయపడేది లేదని అంటున్న ఇరాన్ గతంలో ఎన్నడూ లేని విధంగా తన ఆయుధ ప్రదర్శనల్లో క్షిపణులను ఉంచింది. దేశీయంగా అభివృద్ది పర్చి క్షిపణులను ప్రదర్శించడం ద్వారా ఇరాన్ బల ప్రదర్శనకు దిగినట్టే కనిపిస్తోంది.
ఇరాన్ చేష్టలపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ఇరాన్ వి పిల్లచేష్టలుగా అభివర్ణించిన అమెరికా ఇట్లాంటి చర్యలను చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించింది. అమెరికా -ఇరాన్ ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఏ పరిస్థితికి దారితీస్తాయోననే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత అమెరికా-ఇరాన్ సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నుడూ లేనంతగా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ఈ పరిణామాలు మరింత ముదిరి మరో గల్ప్ యుద్ధం జరిగినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదని విదేశాంగ నిపుణులు అంటున్నారుర.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *