దేశాన్ని నాశనం చేస్తున్న యువరాజులు:బీజేపీ

ఉత్తర్ ప్రదేశ్ ని తద్వారా దేశాన్ని బ్రస్టు పట్టించడానికి ఆ ఇద్దరు యువరాజులు జట్టుకట్టారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యగ్యంగా వ్యాఖ్యానించారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లు సంయుక్త ప్రచారం పై స్పందించిన అమిత్ షా దేశాన్ని నాశనం చేసే కలయికగా అభివర్ణించారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందడం కోసం వైరాలను మర్చిపోయి ఐక్యతా రాగం ఆలపిస్తున్నారని వారి ఆటలు ఉత్తర్ ప్రదేశ్ ఓటర్ల ముందు సాగవవి స్పష్టం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అరాచకాలకు నెలవైన సమాజ్ వాదీ పార్టీని, అవినీతికి మారు పేరైన బీఎస్పీని ప్రజలు మట్టికరిపించడం ఖాయమని చెప్పారు. యూపీ లో ప్రజలు అబివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ ను అన్ని రకాలుగా అభివృద్ది పథంలోకి తీసుకుని పోగల సత్తా కేవలం బీజేపీకో ఉందని అమిత్ షా అన్నారు. తమకు అవకాశం ఇచ్చి చూడాలని తామేంటో నిరుపిస్తామన్నారు. దేశాన్ని అభివృద్ది పథంలోకి తీసుకుని పోతున్న మోడీ వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారని అన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా అంతిమ విజయం తమదే అన్నారు. కులాన్ని అడ్డంపెట్టుకుని ఎన్నికల్లో లాభం పొందడానికి ప్రయత్నిస్తున్నారంటూ సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ లపై అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు.  సమాజ్ వాదీ పార్టీ హయంలో రాష్ట్రం అన్ని రకాలుగా వెనుకబడిపోయిందని అమిత్ షా విమర్శించారు. రాష్ట్రంలో అరాచక శక్తుల రాజ్యం నడుస్తోందని అన్నారు. శాంతి భద్రతలు కనుమరుగయ్యాయని అన్నారు. రానున్న కాలంలో రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *