నయీం ఫొటోలపై నో కామెంట్ :నాయిని

వార్తాపత్రికల్లో వచ్చిన ఫొటోల ఆధారంగా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి స్పష్టం చేశారు. కరడుగట్టిన నేరగాడు నయీంతో కలిసి పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్న ఫొటోలపై మంత్రి స్పందిస్తూ పత్రికల్లో వార్తల ఆధారంగా ఏ నిర్ణయం తీసుకోబోమని చెప్పారు. నయీం కేసున్నింటినీ సిట్ విచారిస్తోందని అతనితో సంబంధం ఉన్న ఎవరినీ విడిచిపెట్టేది లేదని నాయిని స్పష్టం చేశారు. నయీం కేసులను దర్యాప్తు చేస్తున్న సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతోందని వెళ్లడించారు. ఎయింకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి ఎవరెవరు నయీంకు సహకరించారు అనే విషయాన్ని సిట్ దర్యాప్తు చేస్తోందన్నారు. నయీం కు సహకరించిన వారు ఎంతటివారానా వారిపై చర్యలు తీసుకుంటామని నాయిని స్పష్టం చేశారు. నయీం కేసును నీరుగార్చారంటూ వస్తున్న ఆరోపణలను హోం మంత్రి ఖండించారు. అటువంటి వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తమ ప్రభుత్వం అభివృద్ది దిశగా ముందుకు తీసుకుపోతోందన్నారు. సాగు,తాగు నీరు అన్ని ప్రాంతాలకు అందిచే లక్ష్యంతో పనిచేస్తున్న తమ ప్రభుత్వం పై కోదండరాం పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని నాయిని మండిపడ్డారు. విపక్షాలతో కలిసి కోదండరాం ప్రభుత్వం పై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని నాయిని అన్నారు. నీటిపారదల ప్రాజెక్టుల విషయంలో కోర్టుల్లో కేసులు వేయడం ద్వారా ప్రాజెక్టులను అడ్డుకుని రైతుల నోళ్లలో మట్టికొడుతున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *