గాంధీభవన్ ఎదుట కాంట్రాక్టు లెక్చలర్ల ధర్నా కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన టీ న్యూస్ విలేకరి యుగేందర్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాచి చేశారు. ధర్నా కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న క్రమంలో యుగేందర్ పై దాడిచేసిన పోలీసులు ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. కొంతదూరం లాక్కెళ్లి చేయిచేసుకున్నారు. రిపోర్టర్ పై దాడిచేసిన దృశ్యాలు కెమేరాల్లో రికార్డు అవుతుండడంతో వెనక్కితగ్గారు. అక్కడే ఉన్న ఇతర విలేకర్లు దాడిని అడ్డుకున్నా ఫలితం లేకపోయింది. పోలీసులు వ్యవహార శైలిపై విలేకర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న రిపోర్టర్ పై దాడి చేయడం దారణమని అకారణంగా దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విలేకర్లు డిమాండ్ చేశారు. యుగేందర్ పై దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మీడియా ప్రతినిధిపై దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి.
టీన్యూస్ ప్రతినిధిపై పోలీసుల దాడి