ఈశాన్య రాష్ట్రం నాగాల్యాండ్ అల్లర్లతో అట్టుడుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న నాగా గిరిజినలు ఆందోళన బాటపట్టారు. వారి ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. దీనితో పరిస్థితిని అదుపుచేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి వచ్చింది. నాగాల్యాండ్ లోని 32 మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని నాగా గిరిజనలు వ్యతిరేకిస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం తమ సంప్రదాయం కాదని తమ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆందోళన బాటపట్టారు. ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ముఖ్యమంత్రి సన్నిహితులకు చెందిన భవనాలతో పాటుగా ప్రభుత్వ భవనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అల్లర్లను స్థానిక పోలీసులు అదుపులో పెట్టలేకపోవడంతో సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి వచ్చింది.
నాగా గిరిజన సంప్రదాయాల ప్రకారం మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం అని నాగాలు అంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నాగా ప్రతినిధులతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.సెడ్యూల్డ్ ప్రకారం రిజర్వేషన్ల ను అమలు చేస్తూ ఫిబ్రవరి 1వ తేదీన 11 మున్సిపాల్టీలకు ఎన్నికలను నిర్వహించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగా గిరిజనలు ప్రభుత్వ ఆస్తుల విద్యవంసానికి దిగారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ భవనాలు నిప్పుపెట్టారు. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మృతి చెందడంతో పరిస్థితి మరింత విషమించింది. పోలీసు కాల్పుల్లో మరణించిన యువకుల మృతదేహాలతో ఆందోళనకారులు నిర్వహించిన ర్యాలీ తీవ్ర ఉధ్రిక్తతకు కారణం అయింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటుగా ముఖ్యమంత్రికి చెందిన ఆస్తులను, ఆయన సన్నిహుతల ఆస్తులపైనా దాడులు జరిగాయి. రెచ్చిపోయిన ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నిప్పుపెట్టారు. అల్లర్లు నాగాల్యాండ్ రాజధాని కోహిమా నుండి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుండడంతో సైన్యాన్ని రంగంలోకి దింపారు. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.