మంత్రులపై సీఎం గరం…గరం?

 
కొంతమంది మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో అదికారులను బయటకు పంపి కేవలం మంత్రులతోనే మాట్లాడిన కేసీఆర్ కొంత మంది మంత్రులు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని అన్నట్టు సమాచారం. ప్రభుత్వం పై వస్తున్న విమర్శలపై ఎందుకు నోరు మెదపడం లేదని కొంత మంది మంత్రులను సీఎం నిలదీసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం పై పలు విమర్శలు చేస్తున్న జేఏసీ, విపక్షాలకు సరైన రీతిలో ఎవరూ జవాబు చెప్పడం లేదని జిల్లాల పర్యటనల్లో విపక్షాలు, జేఏసీ నేత కోదండరాం విమర్శలు చేస్తుంటే దానికి జవాబు చెప్పడంలో విఫలం అవుతున్నారంటూ మంత్రులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రజలకు వాస్తవాలు వివరించడంలో మంత్రులు విఫలం అవుతున్నారంటూ సీఎం మంత్రులతో అన్నట్టు సమాచారం.
ప్రభుత్వం పై విమర్ళలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పూర్తిగా ముఖ్యమంత్రి మీద నెట్టివేసి మంత్రులు స్తబ్ధుగా ఉంటున్నారని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. క్యాబినెట్ లో చర్చించిన అంశాలు కూడా బయటకు లీక్ కావడం పట్ల కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు కొంత మంది మంత్రులు వారి కుటుంబ సభ్యులు పైరవీలకు పరిమితం అవుతున్నారని వారు తమ తీరును మార్చుకోవాలని సీఎం హెచ్చరించినట్టు సమాచారం. మంత్రుల చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని దీన్ని ఉపేక్షించే అవకాశమేలేదని సీఎం ఘాటుగా అన్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *