3లక్షలకు మించి నగదు లావాదేవీలపై నిషేధం

0
56

దేశవ్యాప్తంగా నగదు చెల్లింపులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల రూపాయల కన్నా ఎక్కువ మొత్తం నిర్వహించే చెల్లింపులు అన్నీ చెక్ లేదా డిజిటల్ రూపంలోనే నిర్వహించాలని నిర్థేశించింది. కేంద్ర బడ్జెట్ లో అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నగదు చెల్లింపుల కారణంగానే పెద్ద ఎత్తున నల్లధనం పోగుపడుతోందని భావించిన సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక కార్యకలాపాలు ఆన్ లైన్ లో నిర్వహించడం వల్ల పూర్తి పారదర్శకతతో లావాదేవీలను నిర్వహించే వీలు కలుగుతుంది. దీనికోసం గాను పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.

  • రు.3 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో నగదు రూపంలో లావాదేవీలు జరపడం కుదరదు.
  • రానున్న ఆర్థిక సంవత్సరంలో 2500 కోట్ల డిజిటల్ లావాదేవీలు నిర్వహించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్న కేంద్రం
  • డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం, ఈ వ్యాపారం నిర్వహించే వారికి తక్కువ వడ్డీకే రుణాలు
  • గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం
  • భీమ్ యాప్ కు లభించిన ఆదరణ స్పూర్తిగా మరింత వేగంగా డిజిటల్ ప్ర్రక్రియవైపు అడుగులు
  • ఆధార్ సహిత స్వైపింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురానున్న ప్రభుత్వం.
Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here