రవితేజ ప్యామిలీ ఫొటోకు 2లక్షల కామెంట్లు

 

 

హీరో రవితేజ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలు బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. రవితేజ భార్యా పిల్లల గురించిన సమాచారం కానీ వారి ఫొటోలు కానీ ఎక్కడా పెద్దగా కనిపించవు. సినిమా కార్యక్రమాలకు సైతం రవితేజ తన కుటుంబ సభ్యులను దూరంగా ఉంచుతారు. సామాజిక మాధ్యమాల్లో సైతం రవితేజ వ్యక్తిగత చిత్రాలను పెద్దగా పోస్టు చేయరు. అయితే దీనికి భిన్నంగా రవితేజ తన కుటుంబం చిత్రాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేసిన కొద్ది సేపటికే దానిపై రెండు లక్షల మంది స్పందించారు.  మరో ఐదు వేల మంది ఆ ఫొటోను షేర్ చేశారు.  ప్యామిలీ సెల్ఫీ టైం అంటూ రవితేజ తన భార్యా పిల్లలతో కలిసి ఉన్న చిత్రాన్ని ఫేస్ బుక్ లో ఉంచారు. వెంటనే ఈ ఫొటోకు అనుహ్యమైన స్పందన కనిపించింది. దాదాపు రెండు లక్షల మంది ఈ ఫొటోకు తమ స్పందన తెలపగా ఐదువేల మంది దీన్ని షేర్ చేశారు.

తన కంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న రవితేజ సినిమా జీవితంలోనూ అటు వ్యక్తిగత జీవితంలోనూ క్రమశిక్షణతో ఉంటారనే పేరుంది. కుటుంబంతోనే ఎక్కువగా గడపడానికి రవితేజ ఇష్టపడతారని సినీవర్గాల సమాచారం.