నేడే కేంద్ర బడ్జెట్….

కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ఈ రోజు (బుధవారం) ప్రవేశపెడుతున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్ రాష్ట్రపతి ప్రసంగ సమంయలో కుప్పకూలి మరణించిన ఇ.అహ్మద్ కు పార్లమెంటు నివాళులు అర్పించిన తరువాత బడ్జెట్ ను ప్రవేశపెడతారు. బడ్జెట్ వాయిదా పడే అవకాశం ఉందటూ వచ్చిన వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ కొట్టివేసింది. బడ్జెట్ ను అనుకున్న రోజునే ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. సిట్టింగ్ సభ్యుడి మృతితో సభను వాయిదా వేయాలా అనే అంశంపై హుటాహుటిన సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం బడ్జెట్ కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఇవాళే సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. అటు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుండి ఆయన పార్లమెంటుకు చేరుకున్నారు.