కాశ్మీరీలకు వీసా ఇవ్వని యూఎస్

ముస్లీంల ప్రాబల్యం ఉన్న ఏడు దేశాలకు చెందిన వారికి వీసాల మంజూరు, అమెరికాలో ప్రవేశంపై ఆంక్షల నేపధ్యంలో భరత్ కు చెందిన ఇద్దరు కాశ్మీరీ క్రీడాకారులకు అమెరికా విసాలను నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాశ్మీర్ కు చెందిన స్నో షూ క్రీడాకారులకు అమెరికా విసాలను నిరాకరించింది. అబిడ్ ఖాన్, తన్వీర్ హుస్సేన్ అనే ఈ ఇద్దరు క్రీడాకారులు న్యూయార్క్ లో జరుగుతున్న క్రీడా పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే వీరికి వీసాలను ఇచ్చేందుకు అమెరికా దౌత్య కార్యాలయం నిరాకరించింది. తాము ప్రస్తుతం పాటిస్తున్న విధానాల కారణంగా వీసాలను ఇవ్వలేకపోతున్నామంటూ వీసా కార్యాలయం పేర్కొంది. దీనితో విసాలు రానికారణంగా తాము పోటీల్లో పాల్గొనలేకపోతున్నట్టు ఇరువురు క్రీడాకారులు వర్తమానం పంపారు.  అయితే అమెరికా ప్రస్తుతం అవలంబిస్తున్న విధానంలో భారతీయులకు వీసాల విషయంలో ఎటువంటి ప్రతికూల అంశాలు లేవని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఇద్దరు కాశ్మీరీ క్రీడాకారులకు వీసాలను మంజురు చేయకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని వారు చెప్పారు. అయితే ఆ కారణాలు ఏమిటన్న విషయాన్ని వెల్లడించేందుకు అమెరికా వర్గాలు నిరాకరించాయి. తాము కొన్ని పరిధిలకు లోబడి పనిచేస్తామని వారు పేర్కొన్నారు. ఇద్దరు కాశ్మీరీ క్రీడాకరులకు వీసాలు ఇవ్వకపోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నట్టు వారు వివరించారు.
భారత్ కు చెందిన ఇద్దరు కాశ్మీరీ క్రీడాకారులకు విసాలు రాకపోవడం లో ప్రత్యేక కారణాలు ఏమీ కనిపించడం లేదని వారికి వీసాలు ఇవ్వకపోవడానికి సహేతుక కారాణాలు లేవని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Already under the controversy over the decision taken by the American government over the restrictions on seven muslim majority countries on entering U.S. India has faced the same when an Indian sportsman’s visa were rejected just because they were from Kashmir. Tanveer Husssain Parra said that he was denied visa by the US Embassy. World Snowshoe Federation (WSSF) world championship is scheduled on February 25 in Saranac Lake,New York. The snowshoe athlete is representing our country in it. According to the new immigration policy his visa has been rejected is what has been explained by the embassy officials.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *