నేడు వసంత పంచమి దీనిని సరస్వతీ జయంతి,మదన పంచమి అనికూడా అంటారు .
- శ్రీ పంచమిని విద్యారంభదినం గా భావిస్తారు . అక్షరాభ్యాసాలకు ఇది మంచి రోజు. బాసర క్షేత్రం లోనూ , మరియూ ఇతర సరస్వతీ దేవాలయాలలోనూ ఈ రోజున అక్షరాభ్యాసాలు చేయిస్తారు
- జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం.
- • సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్
• కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్
• వహ్ని శుద్దాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్
• రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్ - జ్ఞానశక్తికి అధిష్ఠాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలత్వాదుల్ని శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు.
- సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక.
- ఉత్తర భారత దేశంలో ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. రతీ మన్మథులను పూజించడం కూడా ఆనవాయితీ.
- మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు.