కేంద్ర బడ్జెట్ వాయిదా?

 
కేంద్ర బడ్జెట్ వాయిదా పడే అవకాశాలున్నాయి. బడ్జెట్ ను 1వ తేదీకి బదులుగా రెండవ తేదీన ప్రవేశపెట్టవచ్చు. లోక్ సభ ఎం.పీ ఇ.అహ్మద్ మృతి చెందడంతో బడ్జెట్ ను వాయిదా వేయవచ్చని తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ చనిపోతే సభను వాయిదా వేయడం అనవాయితీ దీన్ని అనసరించి సభను ఇవాళ వాయిదా వేసే అవకాశాలు ఉన్నందున బడ్జెట్ ను 2వ తేదీన ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గాంగ్వార్ కూడా దృవీకరించారు. అయితే సభను వాయిదా వేయాలా లేదా అనేది స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయిస్తారని స్పీకర్  నిర్ణయం మేరకు బడ్జెట్ ను ఎప్పుడు ప్రవేశపెట్టాలనేది ఆధారపడి ఉంటుదని ్న్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలోనే తీవ్రమైన గుండెపోటుతో పార్లమెంటు సెంట్రల్ హాల్ లోనే మాజీ మంత్రి, ప్రస్తుత సభ్యుడు ఇ.అహ్మద్ కుప్పకూలిపోయారు. ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కేరళలోని మలప్పురం నియోజకర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన అకస్మాత్తుగా మరణించడంతో బడ్జెట్ వాయిదా పడే సూచనలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *