గౌతమీపుత్ర దర్శక,నిర్మాతలపై ఐటి దాడులు

గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా యూనిట్ మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. సినిమా దర్శకుడు క్రిష్, నిర్మాత రాజీవ్ రెడ్డిల ఇళ్లలో సోదాలు జరిపారు. వాళ్లతో పాటు నైజాం ప్రాంతానికి ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన హీరో నితిన్ తండ్రి, ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి ఇంటిపై కూడా దాడులు జరిగాయి.  దాడులకు సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు. గౌతమీ పుత్ర శాతకర్ణిని భారీ బడ్జెట్ తో రూపొందించారు. 45కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం భారీగా వసూళ్లను సాధించినట్టు వార్తలు వచ్చాయి.
    ఈ చిత్ర దర్శకుడు క్రిష్ కి కూడా ఈ చిత్రంలో భాగస్వామ్యం ఉన్నట్టు వార్తలు రావడంతో ఆయన నివాసంపై కూడా ఐటి అధికారులు దాడులు జరిపారు. గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రానికి సంబందించిన యూనిట్ పై జరిగిన దాడులు సినీ వర్గాల్లో సంచలన రేపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *