తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పూర్తిచేసిన భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా వద్ద నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా పాలేరు రిజర్వాయర్ నుండి కృష్ణా జలాలు ఖమ్మంలోని నీటి సమస్యను ఎదుర్కొంటున్న భూములను సస్యశ్యామలం చేయనున్నాయి. 11 నెలల్లో పూర్తయిన ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశార. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ
- కోటి ఎకరాలకు తాగునీటిని అందచడమే ప్రభుత్వ లక్ష్యం
- అప్పటివరకు విశ్రమించేది లేదు
- ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తి చేస్తున్నాం
- చిత్తశుద్దితోప్రాజెక్టుల నిర్మాణం
- గత పాలకుల వల్లే ప్రాజెక్టులు నిరాదరణకు గురయ్యాయి
- తెలంగాణకు గత ప్రభుత్వాలు అన్యాయం చేశాయి.
- మన ప్రాజెక్టులపై మన నేతలే కోర్టుకు పోవడం దారుణం
- తెలంగాణ వస్తే ఓమవుతుంది అన్న వాళ్ల నోళ్లు మూత పడ్డాయి.
- మన నేతలు ఇప్పుడు ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
- వీళ్లను ప్రజలు ఎప్పటికీ క్షమించరు.
- అన్ని వర్గాల వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
- సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యం పెడుతున్నాం.
- బీడీ కార్మికులకు పించన్లు ఇస్తున్నాం.
- విద్యార్థులకు స్కారల్ షిప్ లు ఇస్తున్నాం.
- మా ప్రభుత్వం చేసే మంచి పనులు విపక్షాలకు కనిపించడం లేదు.
- సమావేశంలో ప్రసంగించిన హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు
- సీ.ఎం పై ప్రసంశల జల్లు
- తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
- తెలంగాణ వస్తే ఏడారే అన్న వాళ్లు ఇప్పుడు ఏం సమాధానం చేప్తారు.
- విమర్శకుల నోళ్లు మూత పడ్డాయి.
- హజరైన కడీయం శ్రీహరి,జగదీశ్ రెడ్డి,ఈటెల రాజేందర్ తదితరులు