అమెరికాలోభారత వ్యాపారి అరెస్ట్

 
అమెరికాలోని విమానాశ్రయంలో ఒక భారతీయుడి అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలను తనకు అందచేయాల్సిందిగా విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అమెరికాలోని భారత్ రాయబారిని ఆదేసించారు. అమెరికాలోని నార్త్ డకోటా విమానాశ్రయంలో గుజరాత్ కు చెందిన వ్యాపారి పరమన్ రాధాకృష్ణన్ ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా ప్రయటనలో ఉన్న ఆయన స్వదశానికి తిరిగి వస్తున్న సమయంలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. బాంబు బెదిరింపుల కేసులో ఈ వ్యాపిరని పోలీసులు అరెస్టు చేశారు. తన బ్యాగులో పేలుడు పదార్థాలు ఉన్నట్టు ట్రావెల్ ఏజెంట్ తో రాధాకృష్ణన్ అన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పేలుడు పదార్థాలు ఉన్నట్టు రాధాకృష్ణ బెదిరింపులకు దిగినట్టు పోలీసులు కేసును నమోదు చేశారు. ఆయనకు సంబంధించిన లగేజీని తనిఖీలు చేస్తున్న సమయంలో స్థానిక పోలీసులు విమానాశ్రయాన్ని పూర్తిగా ఖాలీ చేయించారు.  తన భర్తను పోలీసులు కారణం లేకుండా అరెస్టు చేశారంటూ ఆయన భార్య వాపోతున్నారు. తప్పుడు కేసులో భారత వ్యాపారిని ఇరికించారని పలువురు భారతీయ వ్యాపారులు, రాధకృష్ణన్ స్నేహితులతో పాటుగా సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ పేర్కొన్నారు. ఈ మేరకు వారు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు. దీనిపై స్పందించిన సుష్మ స్వరాజ్ పూర్తి వివరాలు తెలుసుకుని భారత వ్యాపారికి అవసరమైన సహాయం విదేశాంగశాఖ చేస్తుందని చెప్పారు.
తన బ్యాగులో పేలుడు పాదార్థాలు ఉన్నాయని నిజంగానే రాధకృష్ణన్ చెప్పాడా ఒకవేళ చెప్తే ఎందుకు చెప్పాడు అనేదానిపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అయితే రాథాకృష్ణన్ ను అనవసరంగా కేసులో ఇరికించారని ఆయనకు ఎటువంటి పాపం తెలియదను ఆయన బంధువులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *