మత రిజర్వేషన్ల పై రచ్చ

ముస్లీంలకు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్నా కేసీఆర్ ప్రభుత్వ విధానం పట్ల హింధూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ప్రకటించడం వల్ల అనేక సమస్యలు వస్తాయని వీరు అంటున్నారు. మతపర రిజర్వేషన్లు రాజ్యాంక ప్రకారం చూసినా తప్పేననేది వారి వాదన. ప్రస్తుతం వివిధ కులాలకు ఉన్న రిజర్వేషన్లకు తోడు ముస్లీం రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్ ప్రకటించారు. దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేయడంతో పాటుగా వివిధ సందర్భాల్లో సీఎం మస్లీం రిజర్వేషన్లను ఎట్టిపరిస్థితుల్లో అమలు చేసి తీరుతామని గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల మత మార్పిడిలు పెరిగే అవకాశం ఉందని హింధూ సంస్థలు వాదిస్తున్నాయి. మత రిజర్వేషన్లను రాజ్యాంగం కూడా ఒప్పుకోదని వారు అంటున్నారు. ప్రభుత్వం మత రిజర్వేషన్లు ప్రకటించడం ద్వారా నేరుగా మత మార్పిడులను ప్రోత్సహించినట్టే అవుతుందని ఆయా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మత రిజర్వేషన్లను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మత రిజర్వేషన్లను తాము అడ్డుకుని తీరతామని ఆపార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. దీని వల్ల సమాజంలో లోనిపోని అలజడులు రేగుతాయనేది వారి వాదన. మత రిజర్వేషన్ల వల్ల హిందువులు నష్టపోతారని ఇది మత మార్పిడులను ప్రోత్సహించినట్టే అవుతుందని వారంటున్నారు.
మైనారిటీ ఓటు బ్యాంకు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లీం రిజర్వేషన్లను ప్రోత్సహిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాల వల్ల మేజారిటీ వర్గానికి జరుగుతున్న నష్టాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు బీజేపీ వాదనను రిజర్వేషన్లను సమర్థిస్తున్న వారు ఒప్పుకోవడం లేదు. కేవలం రిజర్వేషన్ల కారణంగా మత మార్పిడులు జరుగుతాయనే వాదన అర్థరహితంమని వారంటున్నారు. ముస్లీంలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న విషయాన్ని అనేక సర్వేలు బహిర్గతం చేశాయని వారంటున్నారు. ముస్లీంలు సాధరణ ప్రజానీకంతో పోలీస్తే దాదాపు 40 సంవత్సరాలు వెనకబడి ఉన్న విషయం వెలుగులోకి వచ్చిందని ఈ క్రమంలో వారిని అదుకుంటే తప్పేంటనేది వీరి వాదన.
అణగారిని వర్గాలను ఆదుకోవడానికి తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే ఉద్దేశం లేదని చెప్తున్నారు. మత రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *