ఇన్ఫోసిస్ కార్యాలయంలో యువతి హత్య

సాక్షాత్తూ ఇన్పోసిస్  కార్యాలయంలోనే యువతి దారుణ హత్యకు గురికావడం సంచలనం కలిగిస్తోంది. పుణేలోని ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తున్న 23 సంవత్సరాల రాసీలా రాజు ఓపీ ని అదే కార్యాలయంలో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న వ్యక్తి అతి దారుణంగా హత్యచేశాడు. ఆదివారం యువతి హత్యకు గురికాగా సోమవారం నాడు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూవతిని హత్య చేసింది సైకియా భభెన్ గా పోలీసులు గుర్తించారు. విధులకు హాజరయ్యే క్రమంలో రాసీలా ను సైకియా అదేపనిగా చూస్తూఉండంతో సదరు యువతి శనివారం నాడు సైకియాను హెచ్చరించింది. అతని వ్యవహారంపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో సైకియా ఆదివారం ఆమెను కలిసి తనపై ఫిర్యాదు చేయవద్దని కోరాడు అయితే అందుకు రాసీలా నిరాకరించడంతో సైకియా వైరును గొంతుకు బిగించి హత్యచేశాడు.
కార్యాలయానికి చేరుకున్న రాసీలా ఎంతకూ ఫోన్ లకు సమాధానం ఇవ్వకపోవడంతో అమె మేనేజర్ కార్యాలయం సెక్యూరిటీ విభాగాన్ని అప్రమత్తం చేశారు. కార్యాలయం మొత్తం గాలించగా రాసీలా కార్యాలయంలోని టెలీకాన్ఫరెన్స్ రూంలో విగతజీవిగా పడిఉంది. దీనితో కార్యాలయ సిబ్బంధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా హత్యకు పాల్పడింది సైకియాగా గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. నిత్యం వేలాది మంది విధులు నిర్వహించే ఇన్పోసిస్ లో ఈ దారుణం చేటుచేసుకోవడం సంచలనం రేపుతోంది. ఆదివారం కావడంతో ఉద్యోగులు పెద్దగా లేకపోవడంతో ఈ దారుణం జరిగినట్టు భావిస్తున్నారు. దీనికి తోడు టెలీ కాన్ఫరెన్స్ రూం కు రాసీలా ఒంటరిగా రావడం కూడా హత్యకు ఒక కారణంగా కనిపిస్తోంది. ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన సెక్యూరిటీ వ్యక్తే ఇంజనీర్ ను హత్యచేశాడు. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్త చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *