అంపైరింగ్ వల్లే భారత్ గెల్చింది:ఇంగ్లాండ్

 
భారత్ తో జరిగిన రెండవ టి-20 మ్యాచ్ లో తాము తప్పుడు అంపైరింగ్ వల్లే ఓడిపోయామని ఇంగ్లాండ్ జట్టు ఆరోపిస్తోంది. వివాదాస్పద అంపైరింగ్ వల్లే తాము గెలవాల్సిన మ్యాచ్ ను భారత్ గెల్చుకుందని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆరోపించారు. మ్యాచ్ తమకు అనుకూలంగా ఉన్న సమయంలో అంపైర్ షంషుద్దీన్ తీసుకున్న నిర్ణయాల వల్లే తాము మ్యాచ్ ను కోల్పోవాల్సి వచ్చిందని మోర్గాన్ అన్నారు. అంపైరింగ్ నిర్ణయాలపై తాము మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయబోతున్నట్టు మోర్గాన్ వెల్లడించారు. చివరి ఓవర్ లో బుమ్రా బౌలింగ్ లో తొలి బంతికే రూట్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఈ నిర్ణయం తప్పని ఇంగ్లాడ్ వాదిస్తోంది. బాల్ బ్యాట్ కు తాకినట్టు రిప్లేలో స్పష్టంగా కనిపించని ఇంగ్లాడ్ అంటోంది. రూట్ అవుట్ కావడం వల్లే మ్యాచ్ తమ చేతుల్లోనుండి భారత్ చేతుల్లోకి వెళ్లిందనేది ఇంగ్లాండ్ వాదన. జౌటయిన సమయంలో రూట్ 38 పరుగుల స్కోర్ తో మంచి ఊపుమీద ఉన్న సమయంలో అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల అతను వెనక్కి తిరగాల్సి వచ్చిందని ఆ తరువాత వచ్చిన వాళ్లు కుదురుకోవడానికి ఎక్కువ సమయం పట్టినందువల్లే తాము ఓటమి చెందామనేది మేర్గాన్ వాదన. భారత్ బ్యాటింగ్ లో కోహ్లీ అవుటయినప్పటికీ అంపైర్ నాటవుట్ గా ప్రకటించాడని ఈ రెండు నిర్ణయాలు తమకు భారీ నష్టం కలిగించాయని ఇంగ్లాండ్ అంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *