ఇంత దారుణమా… విద్యార్థిని తగులబెట్టిన వార్డెన్

కృష్ణాజిల్లాలో దారుణంగా జరిగంది. చెప్పిన మాట వినలేదనే నెపంతో హాస్టల్ లో ఉండి 8వ తరగతి చదువుకుంటున్న ప్రవీణ్ అనే  విద్యార్థి పై హాస్టల్ వార్డెన్ పెట్రోలు పోసి నిప్పటించిన అమానవీయ ఘటన కృష్ణా జిల్లా కంభంపాడులో జరిగింది. రిపబ్లిక్ దినోత్సవం నాడు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంభంపాడులోని మధర్ థెరిసా ఆశ్రమంలో ఉండి 8వ తరగతి చదువుకుంటున్న విద్యార్థిపై హాస్టెల్ వార్డెన్ వెంకటేశ్వరరావు పెట్రోల్ పోసి నిప్పంటించాడని తోటి విద్యార్థులు, బాధితుడి తల్లిదండ్రులు చెప్తున్నారు. 70శాతానికి పైగా గాయలతో బాలుడు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. హాస్టల్ లో క్రమశిక్షణను తప్పాడని వార్డెన్ రెచ్చిపోయి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పటించాడని ప్రత్యక్షసాక్షలు చెప్తున్నారు. ఈ వార్డెన్ తమతో అమానుషంగా వ్యవహరిస్తాడని కూడా విద్యార్థులు చెప్తున్నారు.

ప్రస్తుతం 70శాతం కాలిన గాయాలతో విద్యార్థి చావుబతుకులతో పోరాడుతున్నాడు. ఇంతటి దారుణం జరిగినా ఇంతవరకు పోలీసులు కేసును కూడా నమోదు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి ప్రవీణ్ కు సంబంధించిన వ్యవహారం విద్యార్థి సంఘాల ఆందోళనతో వెలుగులోకి వచ్చింది. అత్యంత దారుణంగా విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళన జరపడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చి పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ వర్గాలు స్పందించాయి.

కాలిన గాయాలతో తివ్రంగా గాయపడ్డ విద్యార్థికి వెంటనే చికిత్స లభించలేదని తెలుస్తోంది. తొలుత కంభంపాడు ఆస్పత్రికి విద్యార్థిని తరలించినా అక్కడ అవసరమైన మందులు ఇతర పరికరాలు అందుబాటులో లేవు. తిరిగి విద్యార్థిని రెండు మూడు ఆస్పత్రులు తిప్పిన తరువాత విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ కూడా సక్రమంగా చికిత్స లభించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మెరుగైన చికిత్స కోసం తరలించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.