ఒక్కటవుతున్న ఐడియా,ఓడా

    భారత టెలికాం రంగం సంచనాలకు చిరుమానాగా మారింది. ఇప్పటికే జియో రాకతో టెలికాం రంగంలో పోటీ రంగుగా మారగా తాజాగా రెండు టెలికాం కంపెనీలు అయిన ఐటిడా, ఓడా ఫోన్ లు ఒకటి కాబోతున్నట్టు మార్కెట్ వర్గాలు వెళ్లడించాయి. ఈ వార్తలను ఓడా ఫోన్ వర్గాలు కూడా ఆంగీకరిస్తున్నా. ఈ రెండు దేశీయ కంపెనీలు విలీనం అయ్యేందుకు కసరత్తులు శరవేగంతో జరగుతున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ఐడియా సంస్థ బ్రిటన్ కు చెందిన ఓడా ఫోన్ ను విలీనం చేసుకునే క్రమంలో చర్చలు సాగుతున్నట్టు మార్కెట్ వర్గాలు వెళ్లడించాయి. ఈ విషయాన్ని ఓడా ఫోన్ కూడా దృవీకరించింది.
    ప్రస్తుతం ఐడియా,ఓడా ఫోన్ లు భారత మార్కెట్ లో రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు విలీనం అయితే వీటి ఖాతాదారుల సంఖ్య 39కోట్లకు చేరుతుంది. మార్కెట్ లో ప్రస్తుతం ప్రధమ స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ కు 27కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ఈ రెండు టెలికాం కంపెనీలు విలీనం అయితే వినియోగదారుల పరంగా ఈ నెట్ వర్క్ దేశంలోనే ప్రధమ స్థానంలోకి వస్తుంది. మరో వైపు టెలికాం మార్కెట్ లో సంచలనం రేపుతున్న జియో కు 7.2కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
    ఐడియా కంపెనీ ఓడా కంపెనీని విలీనం చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలతో ఐడియా షేర్లు భారీగా పెరిగాయి. జియో నుండి పెద్ద ఎత్తున పోటీ వస్తుండడంతో దాన్ని తట్టుుకునేందుకు టెలికాం కంపెనీలు ముదస్తు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఎయిర్ టెల్, జియో మధ్య పోటీ తీవ్ర స్థాయిలో జరుగుతున్న నేపధ్యంలో తాజాగా రెండు పెద్ద టెలికాం కంపెనీల విలీనం తో టెలికాం రంగంలో పోటీ మరింత వెడెక్కే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *