ఆ ఖాతాలకు విత్ డ్రా పరిమితి ఎత్తివేత

 
పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు ఉపసంహరణలపై విధించిన ఆంక్షలను ఆర్బీఐ క్రమంగా ఎత్తివేస్తూ వస్తోంది. తాజాగా కరెంటు ఖాతాల నుండి నగదు ఉపసంహరణ పరిమితిని పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. కరెంటు ఖాతాలు, క్యాష్ క్రెడిట్ ఖాతాలు, ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలకు ఎంటీఎల నుండి నగదు ఉపసంపరణకు ఉన్న పరిమితిని పూర్తిగా ఎత్తివేశారు. సేవింగ్ ఖాతాలపై మాత్రం ప్రస్తుతం ఉన్న నిబంధనలు యాధావిదిగా కొనసాగుతాయి. ప్రస్తుతం ఒక రోజుకు 10వేలతోపాటుగా వారానికి 24వేల రూపాయలను మాత్రమే సేవింగ్స్ ఖాతాల నుండి నగదును ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ నిబంధనల్లో ఎటువంటి మార్పాలు లేవు కరెంటు ఖాతాలు ఇతరత్రా కొన్ని ఖాతాలకు సంబంధించిన  పరిమితులను మాత్రమే ప్రస్తుతానికి తొలగించారు. నగదరు సరఫరా మెరుగుపడినందున ఏటీఎంల వద్ద పెద్ద క్యూలు తగ్గాయని ఈ నేపధ్యంలో సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి కూడా త్వరలోనే నగదు ఉపసంహరణ పరిమితిని ఎత్తివేసే అవకాశం ఉన్న బ్యాంకు అధికార వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *