ఇండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మొబైల్ కంపెనీపై కోర్టుకు ఎక్కాడు. తనతో చేసుకున్న ఒప్పందం ముగిసినప్పటికీ మ్యాక్స్ మెబిలింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తనపేరును వాడుకుంటోందని ధోనీ హైకోర్టులో కేసువేశాడు. బ్రాండ్ అంబాసిడర్ గా తన పేరును అక్రమంగా వాడుకుంటున్నారని ధోనీ తన పిటీషన్ లో పేర్కొన్నాడు. తనతో చేసుకున్న ఒప్పందం 2012లోనే ముగిసినప్పటికీ తన పేరును బ్రాండ్ అంబాసిడర్ గా ఆ తరువాత కూడా కొనసాగించడం పై ధోనీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ధోనీకి చెల్లించాల్సిన బకాయిలను కూడా సదరు కంపెనీ చెల్లించడం లేదని ధోనీ తరపున లాయర్ కోర్టు కి తెలిపాడు. మహేంద్ర సింగ్ ధోనీ పలు జాతీయ అంతర్జాతీయ కంపెనీలకు బ్రాండ్ ఎంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.