జల్లికట్టు ఉధ్యమంలో లాడెన్ చిత్రపటాలు

 
జల్లికట్టుకు మద్దతుగా జరిగిన ఆందోళనల్లో కొంత మంది లాడెన్ చిత్రపటాలను పెట్టుకుని వచ్చారని, గణతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించాలంటూ నినాదాలు కూడా చేశారని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అన్నారు. జల్లికట్టు ఉధ్యమంలోకి అరాచక శక్తులు ప్రవేశించాయడానికి ఇంతకన్నా ఇంకేం ఆధారాలు కావాలని ఆయన అసెంబ్లీలో అన్నారు. జల్లికట్టు ఉధ్యమాన్ని పక్కదారి పట్టించడానికి గట్టి ప్రయత్నాలు జరిగాయని అయితే పోలీసులు వాటిని సమర్థవంతంగా అడ్డుకోగలిగారని చెప్పారు. జనాల్లో కలిసిపోయిన కొంత మంది ప్రత్యేక తమిళ నినాదాలు కూడా చేశారని చెప్పారు. జల్లికట్టు ఉధ్యమంలో అరాచకాలు సృష్టించిన వ్యక్తులను వదిలే ప్రశక్తిలేదని పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులపై దాడికి పాల్పడ్డవారి వివరాలు తమ వద్ద ఉన్నాయని వారిని వదిలిపెట్టబోమని చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జల్లికట్టును నిషేధించినప్పుడు అధికారంలో డీఎంకే ప్రభుత్వం ఉందని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేంకు ఆర్డినెన్సును తీసుకుని వచ్చామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *