ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతి కోసం అన్ని చర్యలు:కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ వర్గాలు అన్ని రంగాల్లో ముందడుగు వేసేలే ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కేసీఆర్ తన నివాసం ప్రగతీ భవన్ లో రాష్ట్రానికి చెందిన ఎస్సీ,ఎస్టీ ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు . అణగారిన వర్గాల  అభ్యున్నతి కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ వర్గాల్లో ఇంకా పేదరికం పూర్తిగా తొలగిపోలేదని వారు ఇంకా వెనుకబడే ఉన్నారని అన్నారు. ఎస్సీ,ఎస్టీ వర్గాల్లో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీ,ఎస్టీలకోసం కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చజరిగింది. ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక తీసుకుని రావడం మంచిపరిణామంగా ఈ సమావేశంలో అభిప్రాయపడింది. మంత్రులు  కడియం శ్రీహరి, చందులాల్ తో సహా ఎస్సీ,ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *