ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఉధ్యమిస్తున్న విద్యార్థులకు మద్దతుకోసం హైదరాబాద్ నుండి విశాఖపట్నం వచ్చిన వైఎస్ఆర్ సీపీ నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పోలీసులు విశఖపట్నం ఎయిర్ పోర్టు నుండి బయటకు రానీయలేదు. హైదరాబాద్ నుండి విమానంలో విశాఖపట్నం చేరుకున్న జగన్ ను ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్ పోర్టు నుండి బయటకు రానీయలేదు. పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టులో మోహరించిన పోలీసులు జగన్ ను ఎయిర్ పోర్టు నుండి బయటకు రానీయకుండా నిలువరించారు. దీనితో ఎయిర్ పోర్టులోనే జగన్, అతనితో పాటు వచ్చిన ఇతర నేతలు బైఠాయించారు. భారీ హై డ్రామా తరువాత జగన్ ను ఎయిర్ పోర్టు నుండి మరో విమానంలో పోలీసులు హైదరాబాద్ కు తిప్పిపంపారు. జగన్ ఎయిర్ పోర్టులో ఉన్న సమయంలో హై డ్రామా చోటు చేసుకుంది. తాను తిరిగి హైదరాబాద్ కు వెళ్లనని జగన్ మెండికేశారు. తాను ర్యాలీలో పాల్గొంటానంటూ ఎయిర్ పోర్టులోనే బాఠాయించారు. దీనితో పోలీసులు ఆయన్ను బలవంతంగా హైదరాబాద్ విమానం ఎక్కించారు. ఈ సందర్భాంగా పోలీసులకు జగన్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆరోపించారు.