ఏపీలో హోదా అలజడి

0
94

అంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం ఉధ్యమించాలంటూ ఆంధ్ర యువత పేరుతో మొదలైన ప్రచారం ఊపందుకుంది. సామాజిక మాధ్యమాలే వేదికగా ప్రత్యేక హోదాకోసం అంటూ ఎలుగెత్తిన యువత ఆందోళనలకు రాజకీయ పార్టీల నుండి కూడా మద్దతు లభించింది. టీడీపీ, బీజేపీ మినహా రాష్ట్రంలోని ఇతర పార్టీలన్నీ ఈ ఉధ్యమానికి మద్దతు ప్రకటించాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ఉధ్యమానికి మద్దతు ప్రటించడంతో పాటుగా దీనిపై ట్విట్టర్ లో ప్రతీ గంటకో పోస్టు పెడుతూ అధికార పక్షంపై విరుచుకునిపడుతున్నారు. వైజాగ్ లో జరిగే కొవ్వోత్తుల ప్రదర్శనలో తాను స్వయంగా పాల్గొంటానని విపక్ష నేత జగన్ ప్రకటించిన నేపధ్యంలో ఈ ఉధ్యమ సెగ వేడేక్కింది.
విశాఖపట్నం ఆర్.కే.బీచ్ తో పాటుగా విజయవాడ, తిరుపలు వేదిగ్గా ఉధ్యమం చేపట్టాలనే పిలుపుతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం ఎటువంటి నిరసన ప్రదర్శనలు జరక్కుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా విశాఖపట్నంలో పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. ఆర్.కె.బీచ్ వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. బ్యారికేడ్లను అడ్డుపెట్టి రోడ్లను మూసేశారు. నగరంలోకి వచ్చే అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆర్.కే.బీచ్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అదనపు బలగాలను రంగంలోకి దింపారు. ఇప్పటికే నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. విద్యార్థుల ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా ఉధ్యమం రాజకీయ రంగు పులుపుకుంది. అధికార విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుని పడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యల్లో భాగంగానే విద్యార్థులను రెచ్చగొడుతున్నారంటూ అధికార పక్షం మండిపడుతోంది. విద్యార్థుల ప్రత్యేక హోదా డిమాండ్ సినీ రంగంలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాడులో జల్లికట్టుకోసం సినీ పరిశ్రమ ఏకం అయినట్టు ఆంధ్రాలోనూ సినీ వర్గాలు ఏకం కావాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు మద్దతు ప్రకటించేందుకు వచ్చిన సంపూర్ణేష్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ వెంట సంపూర్ణేష్ బాబు వైజాగ్ వచ్చాడు. ప్రత్యేక హోదా ఉధ్యమానికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తున్న సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎందుకు నోరు మెదపరంటూ రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ సచలనం రేపుతోంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here