సమగ్రాభివృద్దే తెలంగాణ లక్ష్యం

68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ పెరెడ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎల్. నరసింహన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రైతులను అదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. రైతు రుణమాఫీలపై కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. వీటితో పాటుగా మత్స్య పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామన్నారు. గొర్రెల పెంపపకందారలతో పాటుగా కుల వృత్తులను, చేతి వృత్తుల వారికోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమల ఏర్పాటులో చరిత్ర సృస్టింతోదన్నారు. టీహబ్ లతో అంకుర పరిశ్రమల కోసం తీసుకుంటున్న చర్యల వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. మిషన్ బగీరథ తో రాష్ట్రంలో తాగు సాగునీటి కష్టాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు గవర్నర్ వివరించారు. నిరంతరం మంచినీటి సరఫరా కోసం  ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.  హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారుతోందని హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం అవుతున్న నేపధ్యంలో నగర ప్రతిష్టను మరింత పెంచే చర్యలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటోదని చెప్పారు.శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రశక్తే లేదు. ప్రజల భద్రతకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ నరసింహన్ వివరించారు. పోలీసు శాఖను పటిష్టపర్చడంతో పాటుగా వారిలో జవాబుదారితనం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
మైనార్టీలను అన్ని విదాలుగా ఆదుకుంటాం. మైనార్టీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అన్ని మతాలను తెలంగాణ ప్రభుత్వం సమానంగా చూస్తుంది. రంజాన్, క్రిస్మస్ లను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అదే విధంగా యాదగిరి గుట్ల, వేములవాడ, ఆలంపూర్ లను అభివృద్ది చేస్తోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *