అకట్టుకున్న ఎన్ఎస్జీ కమాండోల కవాతు….

nsg3 nsg como
ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల సైనిక కవాతులో ఎన్ఎస్జీ కమాండోలు  ప్రత్యేక ఆకర్షణగా నిల్చారు. 60 మంగి కమాండోలతో కూడిన ఈ బృందం నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిల్చింది. సంప్రదాయానికి భిన్నంగా లయబద్దంగా పరుగులాంటి నడకతో ఎన్ఎస్జీ కమెండోలు ముందు సాగగా వాటి వెనుక వాహనాల్లో అనుసరించిన బృందం విపత్కర పరిస్థితుల్లో ఎన్ఎస్జీ కమెండోలు ఏ విధంగా వ్యవహరిస్తారనేది వివరించారు. భారత గణతంత్ర వేడుకల్లో ఎన్ఎస్జీ కమాండోలు కవాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. ప్రపంచంలోనే పేరెన్నికకన్నా కమెండోలలలో ఒకరిగా పేరున్న మన ఎన్ఎస్జీ కమెండోలు కఠినమైన శిక్షణ తరువాత విధుల్లోకి వస్తుంటారు. అత్యవస సమయాల్లో రంగంలోకి దిగి క్షణాల్లో పని పూర్తే చేసే సత్తా వీరి సొంతం. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువైన నేపధ్యంలో ఈ తరహా కమెండోల సంఖ్యను పెంచుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో వాడుకునేందుకు సిద్ధంగా ఈ కమెండోలు నిత్యం రెడీగా ఉంటారు. ముంబాయి దాడుల సమయంలో మన కమెండోలు చూపిన తెగువను దేశం యావత్తు ప్రత్యక్షంగా చూసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *