రాజ్ పథ్ లో జండావందనం…

ఢిల్లీలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 21 ఫిరంగుల గౌరవవందనంతో పాటుగా సైనిక దళాల బ్యాండ్ ఆలపించిన జాతీయ గీతంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. భారత సైనిక శక్తిని భారత సైనిక దళాలు తమ సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటుగా ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తో పాటుగా కేంద్ర మంత్రులు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యూఏఈ యువరాజు , ఆ దేశపు సైనిక దళాల డిప్యూటీ సుప్రీం సమాండర్  మహ్మద్ బిన్ జైదీ సమక్షంలో ఈ కార్యక్రమంలో కన్నుల పండుగగా జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *