అంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధికిలో ముందంజలో ఉందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల గవర్నర్ నరసింహన్ అన్నారు. అమరావతిల ో జరిగిన 68వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రసంగించిన గవర్నర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధికమించి అభివృద్ధి పథంలో దూసుకుని పోతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమర్థ నాయకత్వంలో ఆటంకాలను అధికమిస్తోందన్నారు. సైగునీటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం కృష్ణ,గోదావరి నదులను అనుసంధానం చేయడం ద్వారా చరిత్ర సృష్టించిందన్నారు. రికార్డు సమయంలో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు. 2019 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. రాష్ట్రాన్ని డిజిటల్ వైపు పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. సైబర్ గ్రిడ్ ను ఏర్పాటు చేయడం ద్వారా 149 రూపాయలకో ఇంటర్నెట్ తో పాటుగా ఫోన్, టెలివిజన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు నరసింహన్ చెప్పారు.
కొత్త రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఆశక్తి కనబరుస్తున్నారని చెప్పారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి రావడం వల్ల ఇక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడితో పాటుగా పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.